మే 30న TFAS ఆధ్వర్యంలో ‘అన్నమయ్య సంగీత విభావరి’
TFAS: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (TFAS), పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారిని స్మరించుకుంటూ మే 30న ఘనంగా ‘ఆరాధన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో గల సాయి దత్త పీఠం సహకారంతో ఈ వేడుకలు జరగనున్నాయి.
ఆకట్టుకోనున్న సాంస్కృతిక ప్రదర్శనలు..
అన్నమయ్య కీర్తనలు, ఆయన జీవనశైలిని ప్రతిబింబించేలా ఈ విభావరిలో పలు విశేష ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
అన్నమయ్య చరిత్ర: స్వాతి అట్లూరి శిక్షణలో సిద్ధేంద్ర కూచిపూడి ఆర్ట్ అకాడమీ విద్యార్థులు ‘కూచిపూడి డాన్స్ బ్యాలెట్’ ద్వారా అన్నమయ్య జీవిత విశేషాలను ప్రదర్శించనున్నారు.
ఇవి కూడా చదవండి
నృత్య నీరాజనం: ‘ఆచార్య డాన్స్ స్కూల్’ విద్యార్థులచే అన్నమయ్య సంకీర్తనలపై భరతనాట్య ప్రదర్శన జరగనుంది.
సంగీతార్చన: మహతి మ్యూజిక్ అకాడమీ, కృష్ణవేణి స్కూల్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్, , స్వర రాగ సుధా కళా అకాడమీలకు చెందిన విద్యార్థులు గాత్ర సంగీతంతో అన్నమయ్య కీర్తనలను ఆలపించనున్నారు.
తెలుగులో రామాయణాలు – విశిష్టత: వాల్మీకి, మొల్ల, రంగనాథ, విశ్వనాథ సత్యనారాయణ వంటి మహనీయులు రాసిన రామాయణ కావ్యాల నుండి పద్య పఠనం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
వివరాలు..
- తేదీ: మే 30, 2026 (శనివారం)
- సమయం: సాయంత్రం 4:00 గంటలకు
- వేదిక: సాయి దత్త పీఠం, ఓక్ ట్రీ రోడ్, ఎడిసన్, NJ.
నిర్వాహకులు..
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని TFAS బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు మధు అన్న, లోకేందర్ గిరకల, అరుంధతి శాఖెల్లి, వెంకట సత్య తాత, శేషగిరిరావు కంభంమెట్టు, వరలక్ష్మి రాధాకృష్ణ, వాణి కునిశెట్టి, లతాదేవి మడిశెట్టి, ప్రసాద్ వూటుకూరు కోరుతున్నారు. వచ్చిన భక్తులకు, అతిథులకు విందు భోజనం ఏర్పాటు చేసారు.
ఇవి కూడా చదవండి






