ప్రధాని మోదీ బాటలోనే .. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, మంత్రులు
మా కాన్వాయ్‌లలో ఉపయోగించే వాహనాల సంఖ్యను తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నిర్ణయించారు. ఇకపై జిల్లాల్లో పర్యటించేటప్పుడూ కాన్వాయ్‌లలోని వాహనాలను సగం తగ్గించాలని అధికారులకు స్పష్టం చేశారు. మంత్రులు, ఇతర వీఐపీలూ సాధ్యమైనంత తక్కువ వాహనాలను వినియోగించేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. అన్ని స్థాయిల్లోనూ సగం వాహనాలే ఉండేలా చూడాలన్నారు. దీంతో సీఎం కాన్వాయ్ 11 వాహనాల నుంచి నాలుగు వాహనాలకే పరిమితమైంది. 2 వాహనాల ఎనఎస్జీ భద్రత, ఎస్కార్ట్ సాయంతో సచివాలయానికి ముఖ్యమంత్రి వెళ్లారు. డిప్యూటీ సీఎం కాన్వాయ్ సగానికి తగ్గించారు. మంత్రి లోకేశ్ వాహనశ్రేణి నాలుగు నుంచి 2 వాహనాలకే పరిమితమైంది. భద్రతా సిబ్బంది కోసం మిన్వ్యాన్ ఏర్పాటు చేశారు. ఏపీ మంత్రులు సైతం కాన్వాయ్ తగ్గించుకొని పొదుపు చర్యలు చేపట్టారు. ఉండవల్లి నివాసంలో లోకేశ్ (Lokesh) తో జరిగిన బ్రే క్ఫాస్ట్ మీటింగ్ కు మంత్రి రామానాయుడు (Ramanaidu) ఎస్కార్ట్ వాహనం లేకుండానే వచ్చారు. మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథి కూడా తమ వాహనశ్రేణినిని రెండుకు పరిమితం చేసుకున్నారు. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని మోదీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతర అంశాల్లోని తీసుకోవాల్సిన పొదపు చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేపట్టింది.
ఇవి కూడా చదవండి






