రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థకు సహకరించాలి : లోకేశ్
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) చేస్తున్న అద్భుత సేవలు తనను ఎంతగానో కదిలించాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆర్డీటీ ఆస్పత్రి (RDT Hospital )ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థకు అందరూ సహకరించాలని సూచించారు. ఆర్డీటీ సేవలను యువగళం పాదయాత్ర సమయంలో ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. మంత్రికి ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ (Mancho Ferrer)తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అంతకుముందు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ (Airport Puttaparthi) కు చేరుకున్న లోకేశ్ కు జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అనంతరం బత్తలపల్లిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి






