విడాకుల వార్తలపై రియాక్ట్ అయిన బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి మౌనీ రాయ్(Mouni Roy) పర్సనల్ లైఫ్ మరోసారి వార్తల్లో నిలిచింది. 2022లో వ్యాపారవేత్త సూరజ్ నంబియార్(Suraj Nambiar) ను పెళ్లి చేసుకున్న మౌనీ రాయ్ గురించి గత కొన్ని రోజులుగా విడాకుల ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా సూరజ్ నంబియార్ మౌనిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం, అనంతరం తన అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో పలు డిజిటల్ మీడియా వేదికలు మరియు సోషల్ మీడియా పేజీలు వారి దాంపత్య జీవితంపై వివిధ కథనాలను ప్రచారం చేయడం ప్రారంభించాయి. అభిమానులు కూడా ఈ వార్తలపై ఆసక్తిగా స్పందిస్తూ, అసలు విషయమేమిటో తెలుసుకోవడానికి ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇలాంటి పరిస్థితుల్లో మౌనీ రాయ్ తొలిసారి స్పందించింది. తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆమె దయచేసి తప్పుడు కథనాలను ప్రచురించవద్దని, తమకు కొంత ప్రైవసీ, స్పేస్ ఇవ్వండంటూ వినయపూర్వక విజ్ఞప్తి చేసింది. అయితే ఆమె పోస్ట్‌లో విడాకుల వార్తలను స్పష్టంగా ఖండించకపోవడం గమనార్హం. దీంతో ఈ ప్రచారం మరింత చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా తన వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునే మౌనీ, ఈసారి మాత్రం జాగ్రత్తగా స్పందించడం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది.
సినిమాల కంటే గ్లామర్ ఫోటోషూట్లు, వెకేషన్ ఫోటోలు మరియు సోషల్ మీడియా పోస్టుల ద్వారానే మౌనీ రాయ్ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె సన్నిహిత స్నేహితురాలు దిశా పటానీ(Disha Patani)తో కలిసి పలు ట్రిప్స్‌కు వెళ్లిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మౌనీ- సూరజ్ సంబంధంపై వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమన్నది స్పష్టత రానప్పటికీ, అభిమానులు మాత్రం ఈ జంట మళ్లీ కలిసి కనిపించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి






