Mouni Roy: స్పెషల్ సాంగ్ గురించి మౌనీరాయ్ స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా రెండు క్రేజీ సినిమాలు రానుండగా అందులో ముందుగా విశ్వంభర(Viswambhara) రిలీజ్ కానుంది. బింబిసార(Bimbisara) ఫేమ్ వశిష్ట(Vasishta) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. చాలా కాలం తర్వాత చిరూ మళ్లీ ఈ జానర్ లో సినిమా చేస్తున్నారు.
ఎప్పుడో రిలీజ్ కావాల్సిన విశ్వంభర వీఎఫ్ఎక్స్ కారణంగా లేటవుతూ వస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గానే విశ్వంభరలోని స్పెషల్ సాంగ్ ను మేకర్స్ షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్(Mouni Roy) చిరూతో కలిసి కాలు కదిపింది. ఆల్రెడీ ఈ సాంగ్ షూటింగ్ పూర్తైనప్పటికీ మేకర్స్ నుంచి మౌనీ రాయ్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.
అయితే తాజాగా ఈ స్పెషల్ సాంగ్ గురించి చెప్తూ మౌనీ రాయ్ ఓ స్పెషల్ పోస్ట్ చేశారు. డైరెక్ట్ గా విశ్వంభర సెట్స్నుంచే చిరూతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆయనతో డ్యాన్స్ చేయడం ఆనందంతో పాటూ గౌరవంగా కూడా భావిస్తున్నట్టు తెలిపింది. అదే పోస్ట్ లో తాను కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య(Ganesh Acharya)కు మరియు చిత్ర యూనిట్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పగా ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.







