చలి మొదలైంది అంటే చాలామందికి జుట్టు రాలడమే పెద్ద సమస్య అవుతుంది. సాధారణంగా ఎండాకాలంలో తల చర్మం త్వరగా డ్రై అవుతుంది. ఇది చుండ్రు, జుట్టు బలహీనతకు కారణమవుతుంది. ఈ పరిస్థితిలో జుట్టును రక్షించడానికి ప్రత్యేక జాగ్రత్తలు అవసరం.
జుట్టు పలుచబడటం, చుండ్రు ఎక్కువ కావడం వంటి సమస్యలకు ఇంట్లోనే చికిత్సగా హెర్బల్ షాంపూ తయారు చేసుకోవచ్చని ఇండియా చర్మరోగ నిపుణులు సూచిస్తున్నారు.
ఈ హెర్బల్ షాంపూ తయారీలో ప్రధాన పాత్ర పోషించేది టీ పొడి. అదనంగా మెంతులు, బియ్యం, కరివేపాకు, నీరు ,సాధారణంగా దొరికే షాంపూను ఉపయోగిస్తారు. ఇవన్నీ తక్కువ ఖర్చుతో ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్థాలే.
పాన్‌ను స్టవ్‌పై పెట్టి అందులో టీ పొడి, ఒక ప్యాకెట్ షాంపూ, 200 మి.లీ నీరు జోడించాలి. ఇప్పుడు మెంతులు, బియ్యం, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి మరిగనివ్వాలి. పదార్థాలు పూర్తిగా ఉడికిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి చల్లారనివ్వాలి.
ఈ హెర్బల్ షాంపూను వాడితే జుట్టు రాలడం తగ్గడంతో పాటు చుండ్రు కూడా నియంత్రితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సహజ పదార్థాలు ఉండటంతో ఇది తలకు హాని చేయదు, అలాగే జుట్టుకు సహజ తేమను ఇస్తుంది.