WATS: విభిన్న కార్యక్రమాలతో అలరించిన వాట్స్ సంక్రాంతి సంబరాలు
వాషింగ్టన్ తెలుగు సమితి (వాట్స్) ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు దేశభక్తిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. సంక్రాంతి పండుగకు ప్రత్యేకమైన సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. సాంస్కృతిక ప్రదర్శనలు, ముగ్గుల పోటీ, పిల్లల ఫ్యాన్సీ డ్రెస్సు, బొమ్మల కొలువు, భోగి పళ్ళు వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే పండుగ వాతావరణానికి మరింత వైభవాన్ని చేకూర్చుతూ సంక్రాంతి విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.
యువతలో తెలుగు సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రవాస తెలుగు సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేసే వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది. ఈ సందర్భంగా వాషింగ్టన్ తెలుగు సమితి అధ్యక్షులు మధు రెడ్డి, కార్యవర్గం తరఫున కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ అతిథులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వాషింగ్టన్ తెలుగు సమితి గత అధ్యక్షులైన వంశీరెడ్డి కంచరకుంట్ల, షకీల్ భాషా పొగాకు,జయపాల్ రెడ్డి దొడ్డా, రామ్ పాలూరి, శ్రీనివాస్ అబ్బూరి, రాజేష్ గుడవల్లి తదితరుల మార్గదర్శకత్వం, నిరంతర సహకారానికి అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వేడుకల విజయవంతానికి అధ్యక్షులు మధు రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రకాశ్ కొండూరు, ప్రధాన కార్యదర్శి రామ్ తమ్మినేని, కోశాధికారి హరిని దేశరాజు, సాంస్కృతిక కార్యదర్శి – శివ వేడూరుపర్తి, సాహిత్య కార్యదర్శి శ్రీరామ్ పాటిబండ్ల, వెబ్ మాస్టర్ కృష్ణ కోటపాటి కృషి చేశారు.













