AUSvsIRE: ఐర్లాండ్పై ఆసీస్ విశ్వరూపం.. 67 పరుగుల తేడాతో ఘన విజయం!
టీ20 ప్రపంచకప్ సమరంలో ఆస్ట్రేలియా తన ప్రతాపాన్ని చూపించింది. ఐర్లాండ్తో (AUSvsIRE) జరిగిన గ్రూప్ మ్యాచ్లో కంగారూలు చెలరేగారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 67 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ గెలుపుతో ఆసీస్ నెట్ రన్ రేట్ను కూడా భారీగా మెరుగైంది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ టీంలో జోష్ ఇంగ్లిస్ (37), మ్యాట్ రెన్ షా (37), కామెరూన్ గ్రీన్ (21), మార్కస్ స్టొయినిస్ (45) రాణించారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ 2 వికెట్లతో రాణించాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఛేజింగ్లో ఐర్లాండ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. లోర్కాన్ టక్కర్ (24), జార్జ్ డాక్రెల్ (41) మాత్రమే కొంత పోరాటపటిమ కనబరిచారు. మిగతా బ్యాటర్లంతా విఫలమవడంతో ఆ జట్టు 16.5 ఓవర్లలో కేవలం 115 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ కేవలం 12 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఆడమ్ జంపా కూడా నాలుగు వికెట్లతో రాణించాడు. బంతితో చెలరేగిన ఎల్లీస్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













