పెరుగుతున్న లేట్ మ్యారేజ్ ట్రెండ్.. రీజన్స్ ఇవే..

06 February 2026

ప్రస్తుత కాలంలో లేట్ మ్యారేజ్ అనేది చాలా మందికి సాధారణంగా మారింది. చదువు, ఉద్యోగం, వ్యక్తిగత లక్ష్యాలే దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఎక్కువకాలం చదువుపై దృష్టి పెట్టడం వల్ల వివాహ నిర్ణయం వెనక్కి వెళ్లుతోంది. ఉన్నత విద్య పూర్తయ్యాకనే స్థిరపడాలనే ఆలోచన పెరుగుతోంది.

ఉద్యోగ భద్రత, ఆర్థిక స్థిరత్వం లేకుండా వివాహం చేయకూడదనే భావన కూడా ఈ ఆలస్యానికి కారణమవుతోంది. కెరీర్‌లో స్థిరత్వం వచ్చిన తరువాతే పెళ్లి అనుకుంటున్నారు.

కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు వంటి అంశాలు కూడా వివాహాన్ని వాయిదా వేయిస్తున్నాయి. కుటుంబ అవసరాలే ప్రాధాన్యంగా మారుతున్నాయి.

సరైన జోడీ దొరకకపోవడం, అభిరుచులు సరిపోకపోవడం వల్ల నిర్ణయం ఆలస్యమవుతోంది. సమాజంలో పెరిగిన అంచనాలు కూడా దీనిపై ప్రభావం చూపుతున్నాయి.

అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా సంపాదించడం ,ఆర్థిక స్వేచ్ఛ ముఖ్యం అనుకోవడం కూడా లేట్ మ్యారేజెస్‌కి ఓ ప్రధాన కారణంగా కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

వివాహం కంటే వ్యక్తిగత స్వేచ్ఛ, స్వయం నిర్ణయాలకే ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఒక కారణం. కాలానుగుణంగా ఆలోచనల మార్పు ఆలస్య వివాహానికి దారి తీస్తోంది.

ఫాలో అవ్వండి.