న‌టిగా కంటే నిర్మాత‌గానే దూసుకెళ్తున్న మెగా డాట‌ర్

09 February 2026

మెగా ఫ్యామిలీ స‌పోర్ట్ తో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ నాగ‌బాబు కూతురు నిహారిక త‌ర్వాత త‌న‌కంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. 

నాగ శౌర్య హీరోగా న‌టించిన ఒక మ‌న‌సు సినిమాతో నిహారిక వెండితెర‌కు హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే.

ఆ సినిమా అనుకున్న ఫ‌లితాల్ని అందుకోక‌పోవ‌డంతో హీరోయిన్ గా నిహారిక త‌ర్వాత ఎక్కువ సినిమాలు చేయ‌లేదు.  

హీరోయిన్ గా అనుకున్న స్థాయికి చేరుకోలేక‌పోయినా నిర్మాతగా మాత్రం నిహారిక రాణిస్తోంది.

క‌మిటీ కుర్రోళ్లు మూవీతో సినీ నిర్మాత‌గా కెరీర్ ను మొద‌లుపెట్టిన నిహారిక ఆ సినిమాతో మంచి హిట్‌ను అందుకోవ‌డ‌మే కాకుండా గ‌ద్ద‌ర్ అవార్డును కూడా అందుకుంది.

ప్ర‌స్తుతం నిహారిక నిర్మాత‌గా రెండో సినిమాను సంగీత్ శోభ‌న్ హీరోగా మాన‌స శ‌ర్మ అనే లేడీ డైరెక్ట‌ర్ తో చేస్తుంది. మ‌రి ఈ సినిమా కూడా క‌మిటీ కుర్రోళ్లు లాగా నిహారిక‌కు మంచి పేరు తెస్తుందేమో చూడాలి.

ఫాలో అవ్వండి.