శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా వచ్చిన తాజా చిత్రం నారీ నారీ నడుమ మురారి.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పండగ సీజన్ లో ఆఖరిగా రిలీజైనా మంచి హిట్ గా నిలిచింది.
జనవరి 15న రిలీజైన ఈ మూవీ మంచి థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వచ్చింది. రిలీజైన 20 రోజులకే ఈ మూవీ ఓటీటీలోకి రావడం విశేషం.
ఈ సంక్రాంతికి పలు పెద్ద సినిమాలు రిలీజైనప్పటికీ అంతటి పోటీలో కూడా శర్వా సినిమా మంచి టాక్ తో ప్రపంచ వ్యాప్తంగా రూ.36 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
థియేట్రికల్ రన్ తర్వాత నారీ నారీ నడుమ మురారి ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.