GATeS ఆధ్వర్యంలో ‘ఇన్కమ్ టాక్స్ 2026, NRI టాక్సేషన్’ వెబినార్
GATeS: గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుల ప్రయోజనార్థం “ఇన్కమ్ టాక్స్ 2026, NRI టాక్సేషన్” అనే అంశంపై ప్రత్యేక వెబినార్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 22, 2026 (ఆదివారం) ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు (EST) జరగనుంది.
ప్రముఖ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (CPA) ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య వక్తగా విచ్చేసి, మారుతున్న పన్ను నిబంధనలు, ఎన్ఆర్ఐ టాక్సేషన్కు సంబంధించిన కీలక అంశాలపై అవగాహన కల్పిస్తారు.
ముఖ్య నిర్వహణ బృందం: ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు GATeS కార్యవర్గ కమిటీ, డైరెక్టర్ల బోర్డు సభ్యులు కృషి చేస్తున్నారు.
- ప్రెసిడెంట్: రమణ గండ్ర
- బోర్డ్ చైర్మన్: జ్యోత్స్న పలకుర్తి
- వైస్ ప్రెసిడెంట్: కీర్తిధర్ గౌడ్ చెక్కిళ్ళ
- జనరల్ సెక్రటరీ: రఘువీర్ రెడ్డి
- ట్రెజరర్: రామకృష్ణ గండ్ర
ఇతర సభ్యులు: అనిల్ కుష్నపల్లి (టెక్నాలజీ సెక్రటరీ), శరత్ గండ్ర (కల్చరల్ సెక్రటరీ), చంద్రశేఖర్ అల్తాటి (మీడియా సెక్రటరీ), గీత నారన్నగారి (ఈవెంట్ సెక్రటరీ), మధుకర్ రెడ్డి (స్పోర్ట్స్ సెక్రటరీ).
అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు విజయ్ వింజమర, హేమంత్ పల్లా, రంజిత్ కోడటి, దినేష్ దుంతుల, రవీందర్ దాసారపు ఈ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు: ఆసక్తి గల వారు https://forms.gle/nwBcZMcToPM5xJyVA లింక్ ద్వారా లేదా పోస్టర్‌లోని QR కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం రమణ గండ్ర (+1 415-328-6229) లేదా జ్యోత్స్న పలకుర్తి (+1 314-420-6084)లను సంప్రదించవచ్చు.






