మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా అందం, ఆమె గ్లామ‌ర్ గురించి సినీ ల‌వ‌ర్స్ అంద‌రికీ తెలుసు.

టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న త‌మ‌న్నా ప్ర‌స్తుతం ఇప్పుడు స్పెష‌ల్ సాంగ్స్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారింది.

ఓ వైపు హీరోయిన్ గా న‌టిస్తూనే మ‌రోవైపు స్పెష‌ల్ సాంగ్స్ లో న‌టిస్తూ కెరీర్లో బిజీబిజీగా ఉంది త‌మ‌న్నా.

36 ఏళ్ల వ‌య‌సులో కూడా తాను ఇంత అందంగా క‌నిపించ‌డానికి గ‌ల కార‌ణాల్ని త‌మ‌న్నా రీసెంట్ గా రివీల్ చేసింది.

1 టీస్పూన్ గంధం, 1 టీస్పూన్ కాఫీ పొడి, 1 టీస్పూన్ స‌హ‌జ తేనె క‌లిపి త‌న ముఖానికి రాసుకుని స్క్ర‌బ్ లా వాడ‌తాన‌ని చెప్పింది. దీని వ‌ల్లే త‌న ముఖం అంత మృదువుగా నిగ‌నిగ‌లాడుతూ ఉంటుంద‌ని త‌మ‌న్నా బ్యూటీ సీక్రెట్ ను రివీల్ చేసింది.