అందాల న‌టి ల‌య తెలుగమ్మాయనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. విజ‌య‌వాడ‌కు చెందిన ల‌య హీరోయిన్ మాత్ర‌మే కాదు, కూచిపూడి డ్యాన్స‌ర్ కూడా.

03 February 2026

ల‌య యంగ్ ఏజ్ లో ఉన్న‌ప్పుడు టాలీవుడ్ లోని ప‌లువురు స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి మంచి ఫాలోయింగ్‌నే సంపాదించుకుంది.

కానీ పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మై ఫ్యామిలీ లైఫ్‌కే ప‌రిమిత‌మైన ల‌య మ‌ళ్లీ రీసెంట్ గానే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.

నితిన్ హీరోగా వ‌చ్చిన త‌మ్ముడు సినిమాలో ల‌య నితిన్ కు అక్క‌గా న‌టించింది. కానీ ఆ సినిమా డిజాస్ట‌ర్ గా నిలిచింది.

ప్ర‌స్తుతం ల‌య, గ‌తంలో సూప‌ర్ హిట్ కాంబో అయిన శివాజీతో క‌లిసి సాంప్ర‌దాయిని సుప్పిని సుద్ద‌పూస‌ని అనే సినిమాలో న‌టించింది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ల‌య చాలా యాక్టివ్ గా  పాల్గొంటుంది. మ‌రి ఈ సినిమా అయినా ల‌య రీఎంట్రీకి ఏమైనా మేలు చేస్తుందేమో చూడాలి.