సాధారణంగా కలుపుగా భావించే కొన్ని మొక్కలు నిజానికి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి, వీటిని సరైన అవగాహనతో వినియోగిస్తే సహజ వైద్యంగా అనేక ఆరోగ్య సమస్యలకు మేలు చేస్తాయి.

మన పరిసరాలలో విస్తృతంగా కనిపించే వేప చెట్టు సహజ ఔషధాల భండారంగా పేరొందింది, వేప ఆకులు, బెరడు, గింజలు చర్మ వ్యాధులు, రక్తశుద్ధి , రోగనిరోధక శక్తి పెంపుకు ఉపయోగిస్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే నల్ల తుమ్మ చెట్టు తొక్క, ఆకులు జ్వరం, వాపు తగ్గిస్తాయి

బిల్వ చెట్టు ఆకులు జీర్ణక్రియ మెరుగుపరచి కడుపు సంబంధిత సమస్యలు తగ్గిస్తాయి.

ఉసిరి చెట్టు విటమిన్ C కు ప్రసిద్ధి చెందిన స్వదేశీ వృక్షం, ఇది రోగనిరోధక శక్తిని పెంచి జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కానుగ చెట్టు నూనె చర్మ వ్యాధులు, గాయాల చికిత్సకు ఉపయోగపడుతుంది.కానీ వీటిని సరైన అవగాహనతోనే ఉపయోగించాలి.