యుక్త వయస్సులోనే జుట్టు తెల్లబడుతున్న వారి సంఖ్య అనేకం. పరిష్కారం కోసం చాలామంది కెమికల్ డైలు, హెయిర్ కలర్‌లు వాడుతున్నారు. కానీ ఇవి జుట్టు ఆరోగ్యానికి ఇవి మంచివి కాదు.
ఒత్తిడి, సరైన పోషకాహారం లేకపోవడం, నిద్రలేమి, కాలుష్యం వంటి కారణాలు చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడానికి కారణమవుతున్నాయి.
ఇంట్లో దొరికే పదార్థాలతో తయారు చేసే చిట్కాలు జుట్టుకు హాని లేకుండా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
కలోంజి ఆయిల్ ఒక కప్పు, ఉసిరి పొడి ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు 15–20 ఆకులు లేదా కరివేపాకు పొడి ఒక టీస్పూన్ అవసరం.
ఈ పదార్థాలను గాజు సీసాలో వేసి మూత బిగించి, వేడి నీటిలో రెండు గంటలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పదార్థాల్లోని సహజ గుణాలు ఆయిల్‌లో కలుస్తాయి. తర్వాత సీసాను బయటకు తీసి చల్లారనివ్వాలి.
ఈ ఆయిల్‌ను చీకటి, చల్లని చోట నిల్వచేసి వారానికి రెండు సార్లు తలకు మసాజ్ చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే జుట్టు బలంగా మారి సహజంగా కనిపిస్తుంది.