TPAD 2026 ఈవెంట్స్ క్యాలెండర్ విడుదల.. సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకల సమాహారం
TPAD 2026: డల్లాస్లోని ప్రవాస తెలంగాణీయుల ప్రముఖ సంస్థ తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) తమ 2026 సంవత్సరపు ఈవెంట్స్ క్యాలెండర్ను ప్రకటించింది. ఈ క్యాలెండర్ ప్రకారం ఏడాది పొడవునా సామాజిక సేవ, క్రీడలు, పండుగలను నిర్వహించనున్నారు.
ఈవెంట్స్ :
సేవా కార్యక్రమాలు: మార్చి 28, ఆగస్టు 8 తేదీల్లో బ్లడ్ డ్రైవ్ (రక్తదాన శిబిరం) నిర్వహిస్తారు. మే 7వ తేదీన ఫుడ్ డ్రైవ్ (ఆహార సేకరణ) కార్యక్రమం ఉంటుంది. అలాగే మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో అడాప్ట్ ఏ హైవే (హైవేల శుభ్రత) కార్యక్రమాలు చేపడతారు.
పండుగలు, సంస్కృతి: ఏప్రిల్ 18న వసంతోత్సవం (Spring Festival) నిర్వహిస్తారు. అక్టోబర్ 17న అత్యంత వైభవంగా బతుకమ్మ – దసరా వేడుకలు జరగనున్నాయి.
క్రీడలు, అవగాహన సదస్సులు: జూన్ 13న క్రీడా పోటీలు (Sports) నిర్వహిస్తారు. ఫిబ్రవరి 8న ఆర్థిక ప్రణాళిక (Financial Planning), జూలై 19న రియల్ ఎస్టేట్ అంశాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు.
ప్రేరణ, పరస్పర సహకారం, అందరినీ కలుపుకుని పోవడమే లక్ష్యంగా (Inspiration, Interaction & Inclusion) TPAD ఈ కార్యక్రమాలను రూపొందించింది.






