ఆస్ట్రేలియా భారీ స్కోర్ మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసింది. ఓపెనర్ లీచ్ ఫీల్డ్ (Litchfield) 119 పరుగులతో సెంచరీ సాధించింది. ఎలీస్ పెర్రీ (Ellyse Perry) 77 పరుగులు, ఆష్లీ గార్డ్నర్ (Ashleigh Gardner) 63 పరుగులతో రాణించారు.
జెమీమా, హర్మన్ జంట హవా భారత్ తరఫున జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) అద్భుతమైన సెంచరీ (127 నాటౌట్)తో మెరిసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి 167 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు.
బౌలర్ల కీలక ప్రదర్శన భారత బౌలర్లలో శ్రీ చరణి, దీప్తి శర్మ (Deepti Sharma) చెరో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటర్లను నియంత్రించారు. రాధా యాదవ్ (Radha Yadav), అమనోజ్యోత్ కౌర్ (Amanjot Kaur) తలో వికెట్ తీసి జట్టుకు బలమయ్యారు.
చరిత్రలో కొత్త రికార్డు 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ భారత్ వన్డేల్లో అత్యధిక స్కోరు చేజ్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ విజయంతో వరుసగా 15 విజయాలు సాధించిన ఆస్ట్రేలియా పరాజయం చవిచూసింది. నవంబర్ 2న ఫైనల్‌లో భారత్ దక్షిణాఫ్రికా తో తలపడనుంది. ఈసారి కొత్త ఛాంపియన్‌ను ప్రపంచం చూడబోతోంది.