2025లో వచ్చిన ఓటీటీ కంటెంట్ ఆడియన్స్ ను విపరీతంగా ఎంటర్టైన్ చేయగా, 2026 సరికొత్త కంటెంట్ తో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది.
అందులో భాగంగానే ఈ ఏడాదిలో యాక్షన్, అడ్వెంచర్ జానర్ ను ఇష్టపడే ఆడియన్స్ కోసం జాన్ విక్ చాప్టర్5 రిలీజ్ కానుంది. చాప్టర్4 క్లైమాక్స్ తర్వాత, జాన్ విక్ మళ్లీ ఎలా వస్తాడనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ది ఫాబల్ మెన్స్: స్టీవెన్ స్పిల్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రాజెక్టు మంచి ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కింది. ఈ మూవీ ఆడియన్స్ ను భావోద్వేగానికి గురి చేయడం ఖాయం.
ది మార్వెల్ మిస్ అడ్వెంచర్స్: మార్వెల్ స్టూడియోస్ మార్వెల్ కామిక్స్ ఆధారంగా నిర్మించిన కంటెంట్ కు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. డైలీ లైఫ్ లో సీరియస్నెస్ కు బ్రేక్ ఇచ్చి, కాసేపు సరదాగా ఉండటానికి ఇవి బెటర్ ఆప్షన్.
రియాన్స్ జాన్సన్ దర్శకత్వంలో వస్తోన్న నైవ్స్ అవుట్3 మిస్టరీ, థ్రిల్లర్ జానర్లు ఇష్టపడే వాళ్లకు మంచి ఆప్షన్.
ఫ్యామిలీ మొత్తం కలిసి కాసేపు సరదాగా గడపాలనుకున్నప్పుడు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్6 మంచి ఎంపికని చెప్పొచ్చు.