జబర్దస్త్ కామెడీ షో తో అందరికీ సుపరిచితురాలైన రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
వచ్చీ రాని తెలుగులో రష్మీ మాట్లాడే ముద్దు ముద్దు మాటలకు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు.
ఓ వైపు యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో వచ్చిన అవకాశాలను అందుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది రష్మీ.
గత కొన్నాళ్లుగా జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షో ను హోస్ట్ చేస్తున్న రష్మీ లీడ్ రోల్ లో ఓ తెలుగు సినిమా రాబోతుంది. అఖిల్ బాబు దర్శకత్వంలో వైతరణి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మీతో పాటూ ప్రదీప్ పల్లి నటిస్తున్నారు.
యాంకర్ అయినప్పటికీ తన అందం తో సినిమా అవకాశాలను అందుకుంటూ హీరోయిన్ల కంటే ఏ విషయంలో తగ్గనని నిరూపిస్తోంది రష్మీ.