చలి, వర్షాకాలం మొదలయ్యాక చాలామందికి గొంతులో కఫం (Phelum) పేరుకుపోవడం, ఛాతీ నిండినట్టుగా అనిపించడం సాధారణం. కఫం ఎక్కువైపోతే దగ్గు (Cough) , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలుగుతుంది. మందులు లేకుండానే ఈ సమస్యను తగ్గించే సహజమైన మార్గాలు ఉన్నాయి.
దీని కోసం ఒక సింపుల్ హెర్బల్ డ్రింక్‌ను (Herbal Drink) ఇంట్లోనే తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇవి మనకు కొత్తేమీ కాదు ఎప్పటినుంచో అమ్మమ్మలు బామ్మలు ఎన్నో రకాల కషాయాలను కఫాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. ఇందులో కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
అవసరమైన పదార్థాలు: ఈ డ్రింక్ కోసం 2 లవంగాలు (Cloves) , 2 నల్ల మిరియాలు (Black Pepper) , ఒక టీ స్పూన్ బెల్లం పొడి (Jaggery powder) , చిటికెడు బ్లాక్ సాల్ట్ (Black Salt) , అల్లం పౌడర్, వాము పౌడర్ అవసరం. ఇవన్నీ ఒక గ్లాసు నీటిలో వేసి సగం తగ్గేవరకు మరిగించాలి.
ఎలా తాగితే మంచిది? హెర్బల్ డ్రింక్‌ను గోరువెచ్చగా అయ్యాక నెమ్మదిగా తాగాలి. రోజువారీ టీ లేదా కాఫీకి బదులుగా దీనిని తీసుకుంటే గొంతు బాగుపడటమే కాకుండా శ్లేష్మం కరిగేందుకు కూడా సహాయపడుతుంది.
ఈ డ్రింక్ ఇచ్చే లాభాలు: ఈ మిశ్రమం ఛాతీలో పేరుకు పోయిన శ్లేష్మాన్ని కరిగిస్తోంది. ఇన్ఫెక్షన్ వల్ల బొంగరపోయిన గొంతును క్లియర్ చేస్తుంది. లంగ్స్ స్వచ్ఛంగా ఉండటానికి సహాయ పడుతుంది. దగ్గు, శ్వాస సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియ మెరుగై ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
జాగ్రత్తలు: హెర్బల్ టీతో పాటు రోజంతా ఎక్కువగా నీరు తాగాలి. వేడి నీటితో పుక్కిలించడం మంచిది. నిద్రపోయేటప్పుడు తల కొంచెం ఎత్తుగా ఉంచాలి. చల్లని ఆహారం నివారించాలి. బయటికి వెళ్లేటప్పుడు చెవులను కవర్ చేసుకోవడం కూడా మంచిది.