చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం ఇప్పుడు చాలా మందిలో కనిపించే సమస్య. శరీరంలో మెలనిన్ తగ్గిపోతే జుట్టు నల్ల రంగు కోల్పోతుంది. విటమిన్ B12, ఐరన్ లోపం, నిద్రలేమి, టెన్షన్, కాలుష్యం కూడా దీనికి దోహదం చేస్తాయి.అయితే డాక్టర్స్ తెల్ల జుట్టును తగ్గించేందుకు నాలుగు అలవాట్లు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.

విటమిన్ B12 & ఫోలేట్: ఈ రెండు పోషకాలు మెలనిన్‌ (Melanin) ఉత్పత్తికి అవసరం. చేపలు (Fish)!, గుడ్లు (Eggs) , పాల ఉత్పత్తులు B12 అందిస్తాయి (Vitamin B12) . ఫోలేట్ కోసం ఆకుకూరలు, శనగలు, తృణ ధాన్యాలు తీసుకోవాలి. ఇవి జుట్టు సహజ రంగును నిలబెట్టడంలో సహాయపడతాయి.

ఫ్రీ రాడికల్స్‌ నియంత్రణ: ఫ్రీ రాడికల్స్ (Pre Radicals) వల్ల జుట్టు మూలాలు బలహీనపడతాయి. బెర్రీలు, బాదం, వాల్‌నట్స్, డార్క్ చాక్లెట్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు (Anti Oxidants) ఉన్న ఆహారాలు తీసుకుంటే ఇవి తగ్గి జుట్టు మరింత బలపడుతుంది.

స్ట్రెస్ కంట్రోల్: స్ట్రెస్‌ (Stress) వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ప్రతిరోజూ  7–8 గంటలు నిద్రపోవడం, యోగా (Yoga) , ధ్యానం (Meditation) , వర్కౌట్స్ అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

నో స్మోకింగ్: స్మోకింగ్ వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి జుట్టు త్వరగా తెల్లబడుతుంది. అందుకే ధూమపానం మానేయడం జుట్టు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.