హైబీపీ ప్రభావం రక్తపోటు (Blood Pressure) ఎక్కువగా ఉన్నప్పుడు గుండె, మెదడు, కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. గుండె ఎక్కువగా పనిచేయాల్సి రావడంతో నరాలు గట్టిపడి, రక్తనాళాలు దెబ్బతింటాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే స్ట్రోక్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం ఉంది.

వ్యాయామం అవసరమా? రక్తపోటు నియంత్రణకు సరైన జీవనశైలి చాలా ముఖ్యం. ముఖ్యంగా రోజువారీ వ్యాయామం (Exercise) బీపీని సహజంగా తగ్గిస్తుంది. కార్డియో వర్కౌట్స్, యోగా, ఐసోమెట్రిక్ ట్రైనింగ్స్ ఇవన్నీ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

ఐసోమెట్రిక్ వర్కౌట్స్ ఈ వర్కౌట్స్‌లో కండరాలు స్థిరమైన పొజిషన్‌లో పనిచేస్తాయి. ప్లాంక్స్ (Planks), వాల్ సిట్స్ (Wall Sits), లో స్క్వాట్స్ (Low Squats), గ్లూట్ బ్రిడ్జెస్ (Glute Bridges) తో పాటు కొన్ని యోగా పోజెస్ వంటివి చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది.

ఐసోటోనిక్ ట్రైనింగ్ Pushups, Lunges, Crunches వంటి ఐసోటోనిక్ వ్యాయామాలు కండరాల కదలికను పెంచుతాయి. ఇవి గుండె రక్తం పంపించే సామర్థ్యాన్ని బలపరుస్తాయి, బీపీ స్థాయిని తగ్గిస్తాయి.

కార్డియో వర్కౌట్స్ రోజూ జాగింగ్ (Jogging), సైక్లింగ్ (Cycling), స్విమ్మింగ్ (Swimming) లాంటి కార్డియో వర్కౌట్స్ 30 నిమిషాలు చేయడం వల్ల గుండె ఆరోగ్యం బలపడుతుంది. వారానికి కనీసం 150 నిమిషాల మితమైన వ్యాయామం చేయడం సిఫార్సు.

హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) స్వల్పకాలిక వేగవంతమైన వర్కౌట్ , విశ్రాంతి కలయిక. ఇది రక్తపోటు తగ్గించడంలో అత్యంత ఫలప్రదం. 2022–2023లో జరిగిన పరిశోధనల్లో ఈ వర్కౌట్స్ గుండె ఆరోగ్యానికి మేలని తేలింది.

రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే హైబీపీ సమస్యను సులభంగా నియంత్రించవచ్చు.