స‌న్నీ డియోల్, అక్ష‌య్ ఖ‌న్నా క‌ల‌యిక‌లో వ‌స్తోన్న 'ఇక్క‌'

05 February 2026

స‌న్నీ డియోల్, అక్ష‌య్ ఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న హై ఆక్టేన్ లీగ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఇక్కా.

సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాపై ఇప్ప‌టికే మంచి బ‌జ్ నెల‌కొంది. స‌న్నీ డియోల్ ఈ సినిమాతోనే ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు.

తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా  ఈ ప్రాజెక్టును అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేస్తూ ఫ‌స్ట్ లుక్ ను రివీల్ చేయ‌గా, ఈ కోర్టు రూమ్ డ్రామా పై ఆడియ‌న్స్ లో ఎగ్జైట్‌మెంట్ పెరిగింది. 

స‌న్నీ డియోల్, అక్ష‌య్ ఖ‌న్నా లాంటి గొప్ప న‌టుల న‌ట‌న‌తో పాటూ, గ్రిప్పింగ్ స్టోరీతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో మోస్ట్ డిస్క‌ష‌న్ మూవీగా నిల‌వ‌నుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. 

ఫ‌స్ట్ లుక్ మ‌రియు అనౌన్స్‌మెంట్ తోనే ఆడియ‌న్స్ లో అంచనాలు పెంచిన ఇక్క మూవీ 2026లో రిలీజ్ కు రెడీ అవుతుంది. 

ఫాలో అవ్వండి.