కాయదు లోహర్ గురించి సౌత్ ఆడియన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ లో వరుస సినిమాలు చేసిన అమ్మడు ఇప్పుడు టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.
ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కాయదుకి ఆ మూవీ తర్వాత తమిళం నుంచే కాకుండా తెలుగు నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాయదు చేతిలో ప్రస్తుతం ఫంకీ, ది ప్యారడైజ్ అనే తెలుగు సినిమాలున్నాయి.
ఈ రెండు సినిమాలతో పాటూ తమిళంలో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న కాయదు, స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా సై అంటోంది.
ప్రస్తుతం అమ్మడి చేతిలో అరడజనుకి పైగా ప్రాజెక్టులున్నాయంటే తనెంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.