తలనొప్పి నుంచి మాటతడబాటు వరకు—బ్రెయిన్ ట్యూమర్ ముందస్తు సూచనలు..

మెదడులో అసాధారణంగా కణాలు పెరుగుతూ కణితి రూపంలో మారితే దాన్ని బ్రెయిన్ ట్యూమర్ (Brain Tumor) అంటారు. ఇది మెదడు, నరాలు, గ్రంథులు లేదా మెదడుని కప్పే పొరల్లో ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో శరీరంలోని ఇతర భాగాల నుండి క్యాన్సర్ కణాలు మెదడుకు చేరి కూడా ఈ సమస్య వస్తుంది.

తరచూ తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు తరచూ తీవ్రమైన తలనొప్పి వస్తుంది. నొప్పి తగ్గేందుకు మందులు వేసుకున్నా ఎక్కువ ఉపయోగం ఉండదు. ఒత్తిడి పెరిగినట్టుగా అనిపించి రోజువారీ పనులు కూడా చేయలేని స్థితి వస్తుంది.

వాంతులు, జీర్ణ సమస్యలు తలనొప్పితో పాటు వాంతులు రావడం సాధారణ లక్షణం. ఏం తిన్నా జీర్ణం కాకుండా ఉండటం, ఆకలి తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. తలనొప్పితో వాంతులు కలిసివస్తే ఆలస్యం చేయకుండా తక్షణం వైద్యులను సంప్రదించడం మంచిది.

కంటి చూపు సమస్యలు బ్లరింగ్, రెండుగా కనిపించడం, స్పష్టంగా చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ట్యూమర్ స్థానం ఆధారంగా కంటి నాడులపై ఒత్తిడి పెరిగి చూపు మందగిస్తుంది.

శరీర కదలికలు తగ్గడం చేతులు, కాళ్లు సరిగ్గా కదలకపోవడం, నడవడంలో ఇబ్బంది పడటం, బ్యాలెన్స్ కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయి. కొంతమంది ఒక్కసారిగా శక్తిని కోల్పోయినట్టుగా అనిపిస్తారు.

బ్రెయిన్ ట్యూమర్ రావడానికి ఖచ్చితమైన కారణాలు తెలియకపోయినా, DNA మార్పులు (DNA Changes), వయసు, కొన్ని ఇన్ఫెక్షన్లు , కెమికల్ ఎక్స్‌పోజర్ వంటి అంశాలు ప్రమాదాన్ని పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. ముందుగా లక్షణాలను గుర్తించడం ప్రాణాలను రక్షిస్తుంది.