విటమిన్ D మాత్రలు అవసరమేనా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన నిజాలు..

04 February 2026

సూర్యకాంతి ద్వారా సహజంగానే లభించే విటమిన్ D కోసం కొందరు విటమిన్ క్యాప్సిల్స్ వాడుతారు.

అధిక మోతాదులో విటమిన్ D తీసుకుంటే కాల్షియం స్థాయులు పెరిగి కిడ్నీ సమస్యలు, వాంతులు, అలసట వంటి సమస్యలు రావచ్చు.

ప్రతి ఒక్కరికీ ఒకే మోతాదు సరిపోదు కాబట్టి, రక్త పరీక్షల తర్వాతే సప్లిమెంట్స్ అవసరమా కాదా నిర్ణయించాలి.

ఇతర మందులతో కలిపి విటమిన్ D తీసుకుంటే దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉండటంతో జాగ్రత్త అవసరం.

సమతుల ఆహారం, సరైన సూర్యకాంతి పొందడం మొదట ప్రాధాన్యం ఇవ్వాలి, సప్లిమెంట్స్‌ను చివరి ఎంపికగా మాత్రమే చూడాలి.

విటమిన్ D శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం అయినప్పటికీ, డాక్టర్ సలహా లేకుండా సప్లిమెంట్స్ తీసుకోవడం ప్రమాదకరం.

ఫాలో అవ్వండి.