ఇమ్యూనిటీ పెంచడం ద్వారా శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. రోజువారీ జీవనశైలి మార్పులతో సహజంగా రోగనిరోధక శక్తిని బలపరచవచ్చు.
హెల్దిగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ సమృద్ధి ఉన్న ఆహారం ఇమ్యూనిటీని పెంచుతుంది.
పరగడుపున గోరువెచ్చటి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగి, బాడీలో మెటబాలిజం పెరగడం తో పాటు ఇమ్యూనిటీ బలపడుతుంది.
రోజు వ్యాయామం చేస్తే బాడీ ఫిట్‌గా ఉంటుంది. యోగా, నడక, జిమ్ వంటి వ్యాయామాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ప్రశాంతమైన నిద్ర మన శరీర కణజాలాలను మరమ్మత్తు చేసి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
హెల్దిగా ఉండడం కోసం స్ట్రెస్, యాంగ్జైటీ వంటి వాటిని తగ్గించడం మంచిది. మెడిటేషన్, యోగా వంటివి దీనికి బాగా సహాయపడతాయి.
రోజంతా శరీరానికి కావాల్సినంత నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లి, శరీరంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి. దీని ద్వారా ఇమ్యూనిటీ బలపడుతుంది.
పెరుగు, మజ్జిగ, ఫర్మెంటెడ్ ఆహారాలు వంటి ప్రోబయోటిక్ ఫుడ్స్ గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తాయి. గట్ ఆరోగ్యంగా ఉంటే రోగనిరోధక శక్తి మరింత బలంగా ఉంటుంది.