TATA: మార్చి 8న ‘టాటా మహిళ’ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
TATA: ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ (TATA) కు చెందిన ‘టాటా మహిళ’ విభాగం ఆధ్వర్యంలో 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ‘Empower, Educate, Celebrate’ అనే థీమ్‌తో మార్చి 8వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
కార్యక్రమ విశేషాలు: మహిళల శారీరక, మానసిక ఉల్లాసం కోసం ఈ వేడుకల్లో ప్రత్యేకంగా జుంబా సెషన్, హెల్త్ సెషన్, సరదా ఆటలను ఏర్పాటు చేశారు. పాల్గొనే వారందరికీ రుచికరమైన అల్పాహారం అందించనున్నారు. టాటా మహిళ సభ్యులందరికీ ప్రవేశం ఉచితం.
నిర్వాహక బృందం (Board of Directors – 2026): ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ క్రింది ప్రతినిధులు కృషి చేస్తున్నారు.
- అధ్యక్షులు: వినోద్ కుమార్ కట్రగుంట
- ఉపాధ్యక్షులు, TLA: నాగ గొంధి
- కార్యదర్శి: వెంకట్ కోగంటి
- కోశాధికారి, మహిళా విభాగం: హేమ దాసరి
- జాయింట్ సెక్రటరీ, తెలుగు బడి: సాయి మహేష్ గడ్డంశెట్టి
- క్రీడల విభాగం: వెంకట నరేష్ మొక్క
- మెంబర్షిప్: ప్రవీణ్ పెద్ది
- ఫుడ్‌లా, జిస్టిక్స్: సాయి శ్రీకాంత్ ఉప్పలపాటి
- లాజిస్టిక్స్, చేయూత: భూమేష్ గండే
- సాంస్కృతిక, సాహిత్య వేదిక: శివ బోనగిరి
- టాటా యువ: గణేష్ మంత్రిప్రగడ
ఆసక్తి గల మహిళలు పోస్టర్‌లోని QR కోడ్ ద్వారా లేదా అధికారిక లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.













