పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పాన్ ఇండియా సినిమా స్పిరిట్.
రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ మొదలవగా, ప్రభాస్ - ప్రకాష్ రాజ్ తో కాంబినేషన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారని వార్తలొచ్చాయి.
అయితే ఈ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నాడని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి.
స్పిరిట్ వాయిస్ టీజర్ ను బట్టి చూసుకుంటే ఈ మూవీలో ప్రకాష్ రాజ్ పాత్ర చాలా కీలకమని అర్థమవుతుంది.
అలాంటి ఆయన సినిమా నుంచి తప్పుకుంటే ఆ పాత్రను ఎవరు రీప్లేస్ చేస్తారనేది ఆలోచిస్తూ ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు.
మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. కాగా ప్రభాస్ స్పిరిట్ తో పాటూ ఫౌజీ సినిమాను కూడా చేస్తున్నాడు.