Assembly: మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ (Assembly) బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 7 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 17 పనిదినాలు సభా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఒకవేళ ఈ మధ్యలో అదనంగా కొత్త బిల్లులను ప్రభుత్వం తీసుకువస్తే ఆ మేరకు మార్చి 7 తర్వాత సమావేశాలను కొనసాగించాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన శాసనసభ వ్యవహారాల సýహా మండలి (బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్,జనసేన తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్ రాజు (P. Vishnu Kumar Raju), శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ అంజనేయులు ఈ సమావేశంలో పాల్గొని బడ్జెట్ సమావేశాల ఎజెండాను ఖరారు చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});













