హెయిర్ స్పా కోసం ప్రతిసారి పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు; ఇంట్లోనే సులభమైన పద్ధతులతో జుట్టుకు పోషణ అందించవచ్చు.
తాజా కొబ్బరి పాలతో తలకు మసాజ్ చేసి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో కడిగితే జుట్టు మెత్తగా, బలంగా మారుతుంది.
గుడ్డు, ఆలివ్ నూనె, తేనె కలిపిన మిశ్రమాన్ని 20 నిమిషాలు పెట్టుకుంటే జుట్టు కరుకుదనం తగ్గి మెరుపు పెరుగుతుంది.
గ్రీన్ టీ నీటిని తలకు అప్లై చేసి కొంతసేపటి తర్వాత కడిగితే హెయిర్ ఫాల్ తగ్గి తల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
కండీషనర్, ఆలివ్ ఆయిల్, గ్లిజరిన్, వెనిగర్ మిశ్రమం పొడి , చిట్లిన జుట్టుకు ఉపశమనం ఇస్తుంది.
అరటిపండు, ఆలివ్ నూనె, పెరుగు మాస్క్ జుట్టును సహజంగా సిల్కీగా, మృదువుగా మార్చుతుంది.
తాజా అలోవెరా జెల్‌ను తలకు, జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగితే డాండ్రఫ్ తగ్గి జుట్టు బలంగా పెరుగుతుంది.
మెంతులను రాత్రంతా నానబెట్టి పేస్ట్ చేసి తలకు పెట్టుకుంటే హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు రూట్స్ బలపడతాయి, సహజ మెరుపు వస్తుంది.