ఓటీటీలోకి వ‌చ్చేసిన ది రాజా సాబ్ 

06 February 2026

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రీసెంట్ పాన్ ఇండియా సినిమా ది రాజా సాబ్.

సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన రాజా సాబ్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది.

ప్ర‌భాస్ మార్కెట్ తో మంచి ఓపెనింగ్స్, ఓ మోస్త‌రు క‌లెక్ష‌న్ల‌ను అందుకున్న రాజా సాబ్ థియేట‌ర్ ర‌న్ ను ముగించుకుని ఓటీటీలోకి వ‌చ్చేసింది.

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ ఈ సినిమా హ‌క్కుల‌ను భారీ ధ‌ర‌కు సొంతం చేసుకోగా, ది రాజా సాబ్ సినిమా ఫిబ్ర‌వ‌రి 6 నుంచి ఆడియ‌న్స్ కు అందుబాటులోకి వ‌చ్చింది. 

ఈ సినిమాలో మాళ‌విక మోహ‌న‌న్, నిధి అగ‌ర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా న‌టించగా, బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

ప్రభాస్ మరియు మాళవిక, నిధి, రిధ్ధి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు హ్యుమర్, రొమాన్స్, యాక్షన్ అన్ని సీన్స్‌లో సంతోషాన్ని ఇస్తుంది.

థియేట్రికల్ ర‌న్ తర్వాత ఓటీటీ లో కూడా ప్రేక్షకుల స్పందన (రెస్పాన్స్) సినిమా విజయాన్ని అంచనా వేయడానికి కీలకం అవుతుంది.

థియేట్రిక‌ల్ ర‌న్ త‌ర్వాత నారీ నారీ న‌డుమ మురారి ఇప్పుడు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వ‌చ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.  

ఫాలో అవ్వండి.