మెడ, చేతుల నలుపు తగ్గించేందుకు సులభమైన హోమ్ టిప్స్..

12th February 2026

ముఖం తెల్లగా ఉండి మెడ, చేతులు, కాళ్లు నల్లగా కనిపించడం మనలో చాలా మంది ఫేస్ చేసే సమస్య..అయితే సరైన సంరక్షణతో దీన్ని తగ్గించుకోవచ్చు

ఓట్స్ , పెరుగు మిశ్రమంతో వారానికి రెండు సార్లు ఎక్స్‌ఫోలియేట్ చేస్తే మృతకణాలు తొలగి చర్మం కాంతివంతంగా మారుతుంది.

నీటితో కలిపిన ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నల్లదనం ఉన్న చోట అప్లై చేస్తే క్రమంగా స్కిన్ టోన్ సమంగా మారుతుంది.

నిమ్మరసాన్ని స్వల్పంగా నీటితో కలిపి రాస్తే సహజ బ్లీచింగ్ గుణాల వల్ల చర్మం మెరుస్తుంది.

అలోవెరా జెల్‌ను రాత్రి అప్లై చేసి ఉదయం కడిగితే పిగ్మెంటేషన్, మచ్చలు తగ్గడంలో సహాయపడుతుంది.

సన్‌స్క్రీన్ వాడటం, టైట్ బట్టలు నివారించడం, కెమికల్ ఉత్పత్తులు తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే నలుపు సమస్య దూరమవుతుంది.

బేసన్‌లో (శెనగపిండి) కొద్దిగా పసుపు, పాలు లేదా రోజ్‌వాటర్ కలిపి మెడ, చేతులపై అప్లై చేస్తే టాన్ తగ్గి చర్మం సహజంగా ప్రకాశిస్తుంది.

కొబ్బరి నూనెలో కొద్దిగా చక్కెర కలిపి సాఫ్ట్‌గా స్క్రబ్ చేస్తే మృతకణాలు తొలగి చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.