ట్రెడిష‌న‌ల్ లుక్ లో అద‌ర‌గొడుతున్న రాజా సాబ్ బ్యూటీ 

10 February 2026

రాజ్ తరుణ్ లవర్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రిద్ధికుమార్, అనగనగా ఓ ప్రేమకథ, రాధే శ్యామ్ లాంటి సినిమాల్లో నటించింది. 

రీసెంట్ గా ప్ర‌భాస్ తో క‌లిసి మ‌రోసారి ది రాజా సాబ్ సినిమాలో  క‌నిపించి ఆడియ‌న్స్ మ‌న‌సుల్ని గెలుచుకుంది రిద్ధి.

తెరపైనే కాకుండా తెర వెనుక కూడా ఆమె గ్రేస్ అలాగే ఉంటుంది. కొత్త తరహా పాత్రలను ఎంచుకుంటూ రిద్ధి కెరీర్లో ముందుకెళ్తుంది.

రిద్ధి కుమార్ తన సహజ నటనతో పాటు అందమైన లుక్స్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. 

రీసెంట్ గా రిద్ధి త‌న ఇన్‌స్టాలో కొన్ని ఫోటోల‌ను షేర్ చేయ‌గా, ఆ ఫోటోల్లో అమ్మ‌డు చాలా ట్రెడిష‌న‌ల్ గా క‌నిపించింది.

సినిమాలతో పాటు ఫ్యాషన్, ట్రెడిషనల్ స్టైలింగ్‌లోనూ రిద్ధి ట్రెండ్ సెట్ చేస్తోంది. ఆమె షేర్ చేసే ఫోటోలు, రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన అందుకుంటున్నాయి.

ముందు రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌తో రిద్ధి కుమార్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుందనే ఆశాభావం అభిమానుల్లో కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే రిద్ధి కుమార్ న‌టించిన రీసెంట్ సినిమా ది రాజా సాబ్ ప్ర‌స్తుతం జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.  

ఫాలో అవ్వండి.