భీమ్లా నాయక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంయుక్త మీనన్ తమిళం, మలయాళంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సంయుక్త మీనన్, టాలీవుడ్ లో సీనియర్ యంగ్ హీరోలతోనూ నటించి వరుస హిట్స్ అందుకుంది. అమ్మడు 7 సినిమాలు చేస్తే ఒక్కటే ఫ్లాప్.
సంయుక్త మీనన్ ఎంపిక చేసుకునే కథలు, పాత్రలే ఆమె విజయానికి ప్రధాన కారణంగా మారాయి.
విరూపాక్ష సినిమాతో తనకి భారీ క్రేజ్ వచ్చింది. అందం, నటన రెండింటితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ గోల్డెన్ బ్యూటీగా స్టార్‌డమ్ అందుకుంది.
తన కెరీర్ ప్రారంభంలో మలయాళ సినిమాలే ఎక్కువగా చేసినప్పటికీ, తర్వాత తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారింది.
యాక్షన్, ఎమోషన్, రొమాన్స్… ఏ జానర్ అయినా ఈజ్‌తో నటించగలిగే నటి అనే పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా విరూపాక్ష తర్వాత ఆమెకు వచ్చిన ఆఫర్లు భారీగా పెరిగాయి.
సోషల్ మీడియాలోనూ సంయుక్తకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫోటోలు, అప్‌డేట్స్ అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి.
గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సంయుక్త ప్రస్తుతం పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాల్లో నటిస్తోంది.