Akhanda2: ఛార్లెట్ లో అఖండ 2 విడుదల…బాలయ్య ఫ్యాన్స్ హంగామా
మాస్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ 2 తాండవం’ ప్రపంచవ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో కూడా ఈ సినిమా రిలీజ్ ను పురస్కరించుకుని బాలయ్య ఫ్యాన్స్ కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఛార్లెట్ లోని రీగల్ స్టోన్ క్రెస్ట్లో ఈ సినిమా రిలీజైంది. ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమానులైన టాగూర్ మల్లినేని, నాగ పంచుమర్తి, నాని వడ్లమూడి తదితరులు కేక్ ను కట్ చేసి ఇతర అభిమానులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. తెలుగు తెరపై మా హీరో తాండవం అదిరిపోయిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ సినిమాను చూసేందుకు వచ్చిన అభిమానులకు, ఇతరులకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. జై బాలయ్య నినాదాలతో థియేటర్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి.






