Revanth Reddy:హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి
అమెరికాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన కొనసాగుతోంది. విద్యార్థుల ఆహ్వానం మేరకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు (Harvard Business School) వెళ్లిన సీఎం, అక్కడి విద్యార్థులతో మాటమంతి నిర్వహించారు. వివిధ అంశాలపై వారితో చర్చించారు. తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలని విద్యార్థులను రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్, తెలంగాణలో అవకాశాలు, బలాలను ప్రపంచానికి చెప్పాలన్నారు. హైదరాబాద్ (Hyderabad) ఇమేజ్ను చాటే బ్రాండ్ అంబాసిడర్లు (Brand Ambassadors)గా ఉండాలని రేవంత్ రెడ్డి కోరారు.






