Anupama Parameswaran: లాక్ డౌన్ గురించి అనుపమ సైలెంట్ గా ఎందుకు?
ఏ సినిమాకైనా ప్రమోషన్స్ అనేవి చాలా కీలకం. ప్రమోషన్స్ వల్ల సినిమాకు ఎంతో మేలు జరుగుతుంది. కేవలం ఈ ప్రమోషన్స్ వల్లే యావరేజ్ సినిమాలు కూడా హిట్లుగా మారిన సందర్భాలున్నాయి. అలానే హిట్ సినిమాలు కూడా సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో సరైన గుర్తింపు దక్కించుకులేకపోయాయి. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇక అసలు విషయానికొస్తే అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran) నటించిన ప్రధాన పాత్రలో ఏఆర్ జీవా(AR Jeeva) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లాక్ డౌన్(Lockdown). చార్లీ(Chalriee), నిరోష(nirosha), ప్రియా వెంకట్(priya venkat), లివింగ్ స్టన్(livingston), ఇందుమతి(Indhumathi), రాజ్‌కుమార్(rajkumar) కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జనవరి 30న రిలీజ్ కాబోతుంది. మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఇప్పటివరకు పెద్దగా బజ్ కూడా ఏర్పడలేదు.
లైకా ప్రొడక్షన్స్(Lyca productions) లాంటి సంస్థ మద్దతు ఉన్నప్పటికీ ఈ సినిమాకు చెన్నై తప్ప మిగిలిన మెయిన్ సిటీల్లో ఆక్యుపెన్సీలు కూడా దక్కలేదు. ఇదంతా పక్కనపెడితే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయినప్పటి నుంచి, ఇప్పటివరకు అనుపమ లాక్ డౌన్ గురించి ఎలాంటి ప్రమోషన్స్ చేసింది లేదు. సోషల్ మీడియాలో కనీసం ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇదంతా చూసి నిర్మాణ సంస్థకు, అనుపమకు మధ్య ఏమైనా ఇబ్బంది ఉందా అని నెటిజన్లు సందేహ పడుతున్నారు.






