Vishwambhara Release: చిరు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వంభర’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్!
హైదరాబాద్: వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని వేచి చూస్తున్న అభిమానులకు తాజాగా ఒక స్పష్టత లభించింది. ఇటీవల జరిగిన ఒక మీడియా ఇంటరాక్షన్‌లో చిరంజీవి మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ లేదా జులై మాసాల్లో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ముఖ్యంగా జులై 10వ తేదీని రిలీజ్ డేట్‌గా చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్టింగ్‌లతో రూపొందుతున్న ఈ సినిమా, టాలీవుడ్లో మరో విజువల్ వండర్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.






