Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల భేటీ
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University)లోని కెన్నెడీ స్కూల్లో కొనసాగుతున్న తరగతుల విరామ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో హార్వర్డ్ ఎక్స్ అధిపతి, వైస్ ప్రొవోస్ట్ ప్రొఫెసర్ డస్టిన్ టిన్స్లే (Dustin Tinsley), హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ డీన్ ప్రొఫెసర్ జెరెమీ వెన్‌స్టీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను రేవంత్ రెడ్డి వారికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం, కెన్నెడీ స్కూల్ (Kennedy School) మధ్య పరస్పర సహకారానికి సీఎం ఆసక్తి వ్యక్తం చేయగా, ప్రొఫెసర్లు సానుకూలంగా స్పందించారు. విద్యా నాణ్యతను మెరుగుపరిచే వివిధ రూపకల్పనలు, ఆధునిక నైపుణ్యాల అభివద్ధి విధానాలు, మానవ వనరుల అభివద్ధి, ఆర్థిక వద్ధిపై చూపే ప్రభావం తదితర అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించారు.






