ATA: త్వరలో ‘ఆటా’ 19వ మహాసభల కర్టెన్ రైజర్
వర్జీనియా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో జరగనున్న 19వ మహాసభలు, యువజన సదస్సు (Youth Convention) ప్రచార కార్యక్రమాల్లో భాగంగా, డీఎంవీ (DMV) ఏరియాలో ఫిబ్రవరి 7వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ‘కర్టెన్ రైజర్’ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. హెర్న్డన్ లోని ‘హిల్టన్ వాషింగ్టన్ డల్లెస్ ఎయిర్పోర్ట్’ ఈ వేడుకకు వేదిక కానుంది.
ఈ సన్నాహక సమావేశంలో నిధుల సేకరణ, మ్యూజికల్ నైట్, ప్రత్యేక విందు కార్యక్రమాలు ఉండనున్నాయి. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోయే ప్రధాన మహాసభలకు ఈ కార్యక్రమం నాంది పలకనుంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్న నిర్వాహకుల వివరాలు:
- జయంత చల్లా – ప్రెసిడెంట్
- శ్రీధర్ బనాలా – కన్వీనర్
- రవి చల్లా – కోఆర్డినేటర్
- శరత్ వేముల – నేషనల్ కోఆర్డినేటర్
- సుధీర్ దామిడి – డైరెక్టర్
- జీనత్ కుందూర్ – కో-కోఆర్డినేటర్
- అరవింద్ ముప్పిడి – కో-కన్వీనర్
- తిరుమల్ మునుకుంట్ల – కాన్ఫరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్
- కౌశిక్ సామ – కో-నేషనల్ కోఆర్డినేటర్
- కిరణ్ ఆలా – కో-డైరెక్టర్
- భువనేష్ భూజాల – పాస్ట్ ప్రెసిడెంట్






