Rahul Gandhi :రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)తో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) 10జన్‌పథ్‌లో భేటీ అయ్యారు. మహాత్మాగాంధీ (Mahatma Gandhi) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టబోతున్న ఆందోళన కార్యక్రమాల గురించి ఆయనకు వివరించినట్లు షర్మిల మీడియాతో తెలిపారు. పేదల పొట్టకొట్టడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించాం. నరేగా పథకాన్ని సరిగ్గా 20 ఏళ్ల కిందట ఫిబ్రవరి 2న ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ (Manmohan Singh), సోనియాగాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డిలు మొదలు పెట్టారు. ఆ పథకాన్ని కాపాడుకోవడానికి అదేరోజు ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. దీనికి రాహుల్‌గాంధీని ఆహ్వానించాం. తప్పకుండా వస్తానని ఆయన హామీ ఇచ్చారు అని తెలిపారు.






