Medaram:మేడారంలో కోలాహలం.. జనమయ్యేమహా జాతర
దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం (Medaram). రెండేళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహా జాతరకు వేళయింది. కోట్ల మంది భక్తుల కొంగుబంగారమైన సమ్మక్క(Sammakka), సారలమ్మ ( Saralamma) తల్లులు గద్దెలపై కొలువుదీరే ఘడియలు ఆసన్నమయ్యాయి. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు వైభవంగా జరిగే జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రూ.251 కోట్ల నిధులు వెచ్చింది తల్లుల గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించడంతో పాటు భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించింది. రాష్ట్రంతో పాటు దేశం నలుమూలలల నుంచి ఆదివాసీలు, ఇతర భక్తులు కోటీ మంది వరకు తరలిరానున్నారని అంచనా వేస్తున్నారు.






