Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి : భట్టి విక్రమార్క
రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలకు భారీగా నిధులు కేటాయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అభివద్ధి చేస్తోందని, మున్సిపల్ ఎన్నికల్లో (Municipal elections) కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కోరారు. మధిర (Madhira)లోని తన క్యాంపు కార్యాలయం వద్ద దివ్యాంగులకు ప్రత్యేక స్కూటర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రలోని అన్ని పురపాలికల్లో పేదలందరికీ రేషన్ కార్డులు (Ration cards) ఇచ్చి 1.02 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. వందకు పైగా నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ముఖ్య నాయకులు సమష్టిగా పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.






