TLCA: టీఎల్సీఏ (TLCA) బోర్డు చైర్మన్గా వి. నాగేంద్ర గుప్త ఎన్నిక
న్యూయార్క్: తెలుగు సాహిత్య, సాంస్కృతిక సంస్థ (TLCA) నూతన బోర్డు చైర్మన్గా వి. నాగేంద్ర గుప్త ఎన్నికయ్యారు. 2026 సంవత్సరానికి గానూ ఆయన బోర్డు చైర్మన్ (BOT Chairman) బాధ్యతలు చేపట్టనున్నారు.
గత 55 ఏళ్లుగా తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణకు కృషి చేస్తున్న ఈ సంస్థకు, నాగేంద్ర గుప్త నాయకత్వం వహించనుండటం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు, తెలుగు వారు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన నేతృత్వంలో సంస్థ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.






