Ajit Pawar: అజిత్ పవార్ మృతి పై ఏపీ క్యాబినెట్ సంతాప తీర్మానం
మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం (State Cabinet) సంతాపం తెలిపింది. ఈ మేరకు తీర్మానం చేసింది. క్యాబినెట్ భేటీ ప్రారంభ సమయంలో ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రస్తావించారు. అజిత్ పవార్ సహా ఐదుగురు చనిపోవడంపై మంత్రివర్గం విచారణ వ్యక్తం చేసింది. ఆయనతో తనకున్న పరిచయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని చంద్రబాబు తెలిపారు. మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటన్నారు.






