Wings India: బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన
హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం (Begumpet Airport)లో వింగ్స్ ఇండియా (Wings India) ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు (Rammohan Naidu) ప్రారంభించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఇది కొనసాగనుంది. వివిధ దేశాలు, సంస్థలకు చెందిన విభిన్న రకాల విమానాలు, హెలికాప్టర్లు (Helicopters), పోర్టబుల్ ఫ్లయిట్లు, వాణిజ్య విమానాలు వైమానిక ప్రదర్శనలో చేస్తున్న విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి.






