Trump: టారిఫ్ ల పెంపుతో ఆర్థికాభివృద్ధి… మధ్యంతర ఎన్నికల ప్రచారంలో ట్రంప్….!
ద్రవ్యోల్భణాన్ని అదుపుచేశా.. సరిహద్దులు మూసేశాం. టారిఫ్ లతో దేశ ఖజానా కలకలలాడుతోంది. అమెరికా పరపతి ప్రపంచవ్యాప్తంగా అమోఘంగా పెరిగింది. ఇది మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ ప్రచారపర్వంలో కీలకాంశాలు.సుంకాలు, పన్నుకోతలు, కొత్త వాణిజ్య ప్రతిపాదనలను ట్రంప్ ప్రచారంలో విస్తృతంగా వినిపిస్తున్నారు. వీటిని కొనసాగించేందుకు రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతివ్వాలని ప్రజల్ని కోరుతున్నారు.
తన ఏడాది పాలనలో అమెరికా ఆదాయం గణనీయంగా పెరుగుతోందన్నారు ట్రంప్.ఆదాయాలు పెరుగుతున్నాయి. పెట్టుబడులు వృద్ధి చెందుతున్నాయి. అమెరికా గ్రేట్ అగైన్ దిశగా మన ప్రయాణం అద్భుతంగా సాగుతోందన్నారు ట్రంప్. పెట్టుబడుల ఆకర్షణలో ప్రపంచంలోఅమెరికా నెంబర్ వన్ కంట్రీగానిలిచిందన్నారు ట్రంప్. టారిఫ్ లు ఆర్థికవ్యవస్థ అభివృద్ధికి గ్రేట్ ఇంజిన్స్ గా ట్రంప్ అభివర్ణించారు.
గ్రేట్ బిగ్, బ్యూటీఫుల్ బిల్ అనే అంశాలను తన ప్రచారంలో ట్రంప్ ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. అంతర్గత వాణిజ్యలోటును ఏకంగా 77శాతం తగ్గించగలిగామన్నారు. ఇప్పుడు విదేశాలతో వ్యాపారంలో అంతరాన్ని చాలా వరకూ తగ్గించామన్నారు. ఆటో మొబైల్ ఇథనాల్ కు సంబంధించి వందశాతం ఎగుమతికి జపాన్ అంగీకరించగా.. 1 బిలియన్ డాలర్ల ఇథనాల్ దిగుమతికి యూకే సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. 20 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా.. అమెరికా బీఫ్ కు ద్వారాలు తెరిచిందన్న ట్రంప్.. చైనా సోయాబీన్స్ కొనుగోలుకు ముందుకు వచ్చిందన్నారు. యూరోపియన్ యూనియన్.. పందిమాంసం, పాల ఉత్పత్తులు, సోయా ఆయిల్ కొనుగోలుకు అంగీకారం తెలిపిందన్నారు ట్రంప్..
దేశ దక్షిణ సరిహద్దును మూసివేయడం ద్వారా అక్రమ వలసలకు చెక్ చెప్పామన్నారు ట్రంప్. అంతేకాదు.. చట్టబద్దంగా వచ్చే వ్యక్తులకు తప్ప.. మిగిలిన వారికి ఎలాంటి అనుమతులుండవన్నారు. దేశంలో క్రైమ్ రేటును, ఆత్మహత్యల శాతాన్ని తగ్గించగలిగామన్నారు ట్రంప్. అంతేకాదు.. మధ్యంతర ఎన్నికల్లో మనం గెలిచి తీరాలన్నారుట్రంప్. మనం ఓడిపోతే.. వీటిలో చాలా వరకూ ఆగిపోతాయని స్పష్టం చేశారు ట్రంప్.






