Sai Pallavi: దీపికా ప్లేస్ లో సాయి పల్లవి?
ఫిదా(Fidaa) మూవీతో అందరి మనసుల్ని గెలుచుకున్న సాయి పల్లవి(Sai pallavi) తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆఫర్లు వస్తున్నాయని సినిమాలను చేసేయకుండా, ఆ సినిమాలో కథ, తన పాత్రకు బలం ఉంటేనే సినిమాలను ఒప్పుకునే అతి తక్కువ మంది హీరోయిన్లలో సాయి పల్లవి కూడా ఒకరు. అందుకే నటిగా ఆమె ఎప్పుడూ ఫెయిలవలేదు.
సాయి పల్లవి చేసిన ప్రతీ పాత్రా ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందే. అలా అందరిలోనూ భిన్నమైన నటిగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టు రామాయణ(ramayana)లో బిజీగా ఉంది. నితేష్ తివారీ(nitesh tiwari) దర్శకత్వంలో సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి కెరీర్లో తీరిక లేకుండా ఉంది. పైగా ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్(MS Subbalakshmi Biopic) లో కూడా సాయి పల్లవినే నటిస్తుందని వార్తలొస్తున్నాయి.
ఇవి కాకుండా ఇప్పుడు సాయి పల్లవికి మరో బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. కల్కి2(Kalki2) లో దీపికా పదుకొణె(Deepika Padukone) పోషించిన సుమతి పాత్రలో సాయి పల్లవిని తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. కొన్ని కారణాల వల్ల దీపికా కల్కి2 నుంచి తప్పుకోగా, అప్పట్నుంచి ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అని మేకర్స్ ఆలోచనలో పడ్డారు. పలువురుని పరిశీలించాక మేకర్స్ సాయి పల్లవి అయితేనే బావుంటుందని ఓ నిర్ణయానికొచ్చారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది.






